వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్ గేల్ రికార్డు: మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డు డబుల్ సెంచరీ సాధనలో భారత చలువ ఉంది. అతను 215 పరుగుల రికార్డు స్కోరును మెడ్ ఇండియ ట్యాగ్‌తో సాధించాడు. నలబై ఏళ్ల ప్రపంచ కప్ పోటీల్లో డబుల్ సెంచరీ సాదించిన తొలి అటగాడిగా గేల్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేపై 138 బంతుల్లో డబుల్ సెంచరీ ఉతికేశాడు. అందుకు అతను భారత్‌లో తయారైన బ్యాట్‌ను వాడాడు.

35 ఏళ్ల గేల్ మంగళవారంనాటి మ్యాచులో కొన్ని రికార్డులను తిరగరాశాడు. అతను 16 సిక్స్‌లు బాది రోహిత్ శర్మ, డీవిలియర్స్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో ఐదో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా గేల్ చరిత్రకెక్కాడు.

జింబాబ్వేను ఉతికి ఆరేసిన గేల్ స్పార్టాన్ బ్యాట్ భారతదేశంలోని జలంధర్‌లో తయారైంది. జమైకా ఆటగాడు క్రిస్ గేల్ స్ప్రార్టాన్ స్పోర్ట్స్ అంబాసిడర్లలో ఒకడు. గేల్ డబుల్ సెంచరీ చేయగానే అత్యంత వేగంగా స్పార్టాన్ స్పందించింది. ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన జింబాబ్వేపై మ్యాచులో క్రిస్ గేల్ నిజమైన స్పార్టాన్ వారియర్‌గా కనిపించాడని వ్యాఖ్యానించింది.

World Cup: India helped Chris Gayle score record 215

స్పార్టాన్‌కు తన రికార్డు ద్వారా అత్యంత ఆదరణను తెచ్చిపెట్టాడు. 2012 ఐపియల్ పోటీలకు ముందుగానే గేల్ స్పార్టాన్ అంబాసిడర్ కుటుంబంలో చేరాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున స్పార్టాన్ బ్యాట్ ద్వారా ఆడి ఎనలేని ప్రభావం చూపించాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ మైకెల్ క్లార్క్‌, మిచెల్ జాన్సన్, సర్ వివియన్ రిచర్డ్స్ తదితురలతో పాటు భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా స్పార్టాన్ స్పోర్ట్స్ అంబాసిడర్ జాబితాలో ఉన్నాడు. గత రెండేళ్లుగా గేల్ స్పార్టాన్ బ్యాట్ వాడుతున్నాడు. అతను 1250 నుంచి 1300 గ్రాముల అత్యంత బరువైన బ్యాట్‌ను అతను వాడుతాడు. తాము 15 బ్యాట్లు పంపించామని, వాటిలో ఒకదాన్ని గేల్ వాడాడని స్పార్టాన్ స్పోర్ట్స్‌కు చెందిన అమిత్ శర్మ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.

గేల్ రికార్డు జలంధర్‌లోని క్రీడా పరికరాల పరిశ్రమకు ప్రోత్సాహం ఇస్తుందని భావిస్తున్నారు. తాము అస్ట్రేలియాకు ఇదివరకే బంతులను పంపిస్తున్నామని, తమ బ్యాట్, ప్రొటెక్టివ్ గియర్ ప్రపంచ కప్ పోటీల్లో వాడడం ఇదే తొలిసారి అని శర్మ అన్నారు. రికార్డు సృష్టిస్తున్న తర్వాత స్పార్టాన్‌కు గేల్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

English summary
Chris Gayle's record World Cup double hundred had an Indian touch. The record 215 was scored in Canberra with 'Made in India' tag!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X