• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫైనల్ ఓవర్‌లో 6 6 6 6: ఎవరీ కార్లోస్ బ్రాత్‌వైట్?

By Nageswara Rao
|

కోల్‌కత్తా: 156 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండిస్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ వరల్డీ టీ20 పైనల్‌లో విజయం సాధించింది. క్రికెట్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ.. ఇంగ్లాండ్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ వెస్టిండిస్ ఛాంపియన్‌గా అవతరించింది.

అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తూ.. తనదైన శైలిలో, తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు 'మా జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే' అన్న కెప్టెన్‌ సామి వ్యాఖ్యలు అక్షరాలా నిజమేనని రుజువు చేశాడు బ్రాత్‌వైట్‌.

ఫోటో గ్యాలెరీ : వెస్ట్ ఇండీస్ టీం సంబరాలు

బ్రాత్‌వైట్ ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్. చేజారిందననుకున్న వరల్డ్ కప్‌ను కేవలం నాలుగు బంతుల్లో విండిస్ జట్టువైపుకి తిప్పేశాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండిస్ విజయం సాధించాలంటే చివరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది.

World T20: West Indies crowned champions after Brathwaite's 6 6 6 6 in final over

ఈ స్థితిలో విండీస్‌కు విజయం కష్టమేనని అనుకున్నారంతా. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ బ్రాత్‌వైట్‌ (34 నాటౌట్‌; 10 బంతుల్లో 1×4, 4×6) స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండిస్‌కు విజయం అందించాడు. అప్పటివరకు ఒంటి చేత్తో విండీస్‌ జట్టుని నడిపించిన శామ్యూల్స్‌ (85 నాటౌట్‌) పోరాటానికి ప్రతిఫలం దక్కింది.

దీంతో వెస్టిండిస్ జట్టు సంబరాలకు అంతులేకుండా పోయింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుచుకున్న తొలి జట్టుగా వెస్టిండీస్‌ రికార్డు సృష్టించింది. వెస్టిండిస్‌కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టడంతో కీలకపాత్ర పోషించిన కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ పేరు ఇప్పుడు మారుమ్రోగి పోతుంది.

నిజానికి అతని గురించి అభిమానులకు తెలిసింది చాలా తక్కువ. వరల్డ్ టీ20 కప్‌ వరకు అతను ఆడింది ఒకే ఒక టీ20 మ్యాచ్‌ మాత్రమే. అదీ 2011లో బంగ్లాదేశ్‌పై. ఆ తర్వాత వెస్టిండీస్‌ జట్టులో చోటు సంపాదించడానికి ఈ ఆల్‌రౌండర్‌కు మూడేళ్ల సమయం పట్టింది.

World T20: West Indies crowned champions after Brathwaite's 6 6 6 6 in final over

బ్రాత్‌వైట్‌కు బౌలర్‌గా తప్ప బ్యాట్స్‌మన్‌గా పెద్దగా పేరు లేదు. దేశవాళీ క్రికెట్లో బార్బడోస్‌ తరఫున అద్భుతంగా రాణించిన బ్రాత్‌వైట్‌ 8 మ్యాచ్‌ల్లోనే 26 వికెట్లు పడగొట్టాడు. అందులో ట్రినిడాడ్‌ టొబాగోపై చేసిన అత్యుత్తమ ప్రదర్శన (7/90) కూడా ఉంది. ఈ ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకుని బంగ్లా పర్యటించిన విండీస్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన బ్రాత్‌వైట్‌ 2015 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. బాక్సింగ్‌ డే టెస్టులో ఎనిమిదో నెంబర్‌లో బరిలో దిగి 59 పరుగులు చేసి విండీస్‌ కుప్పకూలకుండా కాపాడాడు బ్రాత్‌వైట్‌. ఆ తర్వాత సిడ్నీ టెస్టులో 71 బంతుల్లో 69 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు.

అద్భుతమైన భారీ షాట్లు కొట్టే బ్రాత్‌వైట్‌ ప్రదర్శనను చూసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంఛైజీ 2016 ఐపీఎల్‌ వేలంలో అతణ్ని ఏకంగా రూ.4.2 కోట్లు వెచ్చించి కొనుక్కుంది. ఇది అతని కనీస ధర (30 లక్షలు)గా నిర్ణయిస్తే అంతకు మించి 14 రెట్లు ఎక్కువ పెట్టి మరీ కొనుగోలు చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kolkata, April 3: West Indies tonight (April 3) created history by becoming the first nation to win the ICC World T20 twice with a dramatic four wicket victory over England riding on Carlos Brathwaite four consecutive lusty sixes in the final over of the innings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more