వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాలీ వయాగ్రా: అద్భుత ఔషధ మూలిక.. డిమాండే డిమాండ్..

కేవలం నపుంసకత్వాన్ని తగ్గించే లేదా లైంగిక కోర్కెలు తీర్చే మూలికగానే కాక కీళ్ల నొప్పులు, ఊబకాయం, క్యాన్సర్ వంటి రోగాలను నయం చేయడానికి కూడా యార్సాగుంబా ఉపయోగపడుతుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండు: పేదరికంలో మగ్గుతున్న ఎంతోమంది నేపాలీలకు అదొక ఉపాధి మార్గం. ప్రాణాలకు తెగించి మరీ హిమాలయ పర్వతాల మీద దానికోసం అన్వేషిస్తారు. నెలరోజులు పాటు జరిగే దీని అన్వేషణ పైనే.. ఆ తర్వాత వీరి కుటుంబ పోషణ ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దేనికోసం వీరి అన్వేషణ అంటే.. 'యార్సాగుంబా' కోసం.

లైంగిక కోర్కెలకు ఉత్ప్రేరకంగా ఈ యార్సాగుంబా పనిచేస్తుంది. దీన్నే హిమాలయన్ వయాగ్రా అని కూడా అంటారు.వేసవి ప్రారంభంలో మంచు కరగడం మొదలైన నాటి నుంచి వీటి కోసం నేపాలీల అన్వేషణ సాగుతుంది. మార్కెట్లో యార్సాగుంబాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో.. నేపాలీలు దీన్నో ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు.

యార్సాగుంబా ఎలా ఉంటుంది?

యార్సాగుంబా ఎలా ఉంటుంది?

గొంగళి పురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల్లా కనిపించే ఫంగస్‌నే యార్సాగుంబా అంటారు. పసుపు పచ్చ రంగులో ఉండే యార్సాగుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోర్కెలను రేకెత్తించడంలో ఉపకరిస్తుంది. అంతేకాదు చాలా రకాల జబ్బులకు కూడా ఈ మూలికను ఉపయోగపడుతుంది.

యార్సాగుంబా గురించి మరిన్ని:

యార్సాగుంబా గురించి మరిన్ని:

చైనాలో కనిపించే డాంగ్ ఛాంగ్ జియా కావో అనే రెండు రెండు తలల పురుగు నుంచే ఈ యార్సాగుంబాను సేకరిస్తున్నారు. ఈ పురుగును వేసవి గడ్డి, చలికాలపు పురుగు అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా కనిపిస్తే.. వేసవిలో మాత్రం ఫంగస్ కారణంగా చిన్న మొక్కలా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత అదొక అగ్గిపుల్ల తరహాలో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడవు కనిపిస్తుంది.

వెయ్యేళ్ల క్రితం వెలుగులోకి:

వెయ్యేళ్ల క్రితం వెలుగులోకి:

వెయ్యేళ్ల క్రితమే యార్సాగుంబా ఆనవాళ్లను చైనాలోని పశుపోషకులు వెలుగులోకి తెచ్చినట్లు చెబుతారు. యార్సాగుంబాను అక్కడి రైతులు పశు దాణాగా ఉపయోగించేవారు. దీన్ని తిన్న పశువులు కూడా చురుగ్గా పనిచేయడం గమనించేవారు. ఈ మూలికల్లో ఉండే ప్రత్యేకత వల్లే పశవులు చురుగ్గా పనిచేస్తున్నాయని గుర్తించారు.

1960ల నాటి కాలంలో టీ, సూప్ వంటి ద్రవరూప పదార్థాల్లోను ఈ మూలికను ఉపయోగించేవారు. బాతులను వంటకు ఉపయోగించే సమయంలో ముందు వాటికి యార్సాగుంబా తినిపించేవారు.

డిమాండ్ ఎక్కువ.. దొరికేది తక్కువ!:

డిమాండ్ ఎక్కువ.. దొరికేది తక్కువ!:

1990ల్లో ఓ చైనీస్ రన్నర్ రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడంలో.. ఈ మూలిక అతనికి సహాయపడింది. ఇది ఇచ్చిన శక్తి వల్లే తనకు ఆ ఫీట్ సాధ్యమైందన్న ప్రచారం ఉంది. దీంతో ఒక్కసారిగా యార్సాగుంబాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించినట్లయింది.

కేవలం నపుంసకత్వాన్ని తగ్గించే లేదా లైంగిక కోర్కెలు తీర్చే మూలికగానే కాక కీళ్ల నొప్పులు, ఊబకాయం, క్యాన్సర్ వంటి రోగాలను నయం చేయడానికి కూడా యార్సాగుంబా ఉపయోగపడుతుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. యార్సాగుంబాపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పెరుగుతుండటంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది.

ఈ ఉత్పత్తుల కోసం జనమంతా ఎగబడుతున్నారు. దీంతో 2009-11తర్వాత యార్సాగుంబా ఉత్పత్తి సగానికి పైగా పడిపోయినట్లు తెలుస్తోంది. సరైన నియంత్రణ లేకపోవడం, వాతావరణ మార్పులు, ఉత్పత్తికి మంచి డిమాండ్ ఉండటమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతారు.

English summary
Yarsagumba is known to science as Ophiocordyceps sinensis. In Chinese, it is called Dong cong xia cao. However, the origins are Tibetan: Yart Swa Gun Bu, which means ‘herb in the summer and insect in the winter’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X