వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొహంపై చెప్పేశాడు: చాపెల్ బ్రదర్స్‌పై సచిన్ ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: చాపెల్ సోదరులు (ఇయాన్ చాపెల్, గ్రెగ్ చాపెల్) సమయానికి తగినట్లు రంగు మారుస్తుంటారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి సచిన్ ఓ కార్యక్రమంలో ఆదివారం నాడు జవాబిచ్చాడు.

కొన్నేళ్ల క్రితం డర్బన్‌లోని ఓ జిమ్‌లో సచిన్‌ కసరత్తు చేస్తుండగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ ఛాపెల్‌ అక్కడికి వచ్చాడు. ఓహో ఇదన్నమాట నీ విజయ రహస్యమంటూ.. సచిన్‌ను పలకరించాడు. దానికి సచిన్‌ 'అన్నదమ్ములిద్దరూ భలే రంగులు మారుస్తారు. మీ అన్న (గ్రెగ్‌ చాపెల్‌) భారత క్రికెట్‌ను ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లాడ'ని అన్నాడు.

అంతకుముందు సచిన్‌ కెరీర్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇయాన్ చాపెల్ విమర్శించాడు‌. అది మనసులో ఉంచుకున్న సచిన్ అలా బదులిచ్చాడు.

 Your brother took our cricket back by five years, Sachin Tendulkar told Ian Chappell

క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఇయాన్ చాపెల్ వ్యాఖ్యతగా స్థిరపడగా, గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టు కోచ్‌గా చాలాకాలం పని చేశాడు. గ్రెగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే సచిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాడు చాపెల్ నుంచి సచిన్‌కు పెద్దగా సహకారం లభించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

సాధారణంగా శాంత స్వభావి అయిన సచిన్ నాడు చాపెల్ బ్రదర్స్ పైన విరుచుకుపడ్డాడు. అయితే ఇయాన్‌తో జరిగిన మాటామాటలో... సహనం నశించిన సచిన్ ఆ సమయంలో ఘాటుగానే సమాధానం చెప్పాడు. గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్నప్పుడు పలు పత్రికల్లో ప్రత్యేక కాలమ్‌లు రాసే క్రమంలో ఇయాన్ భారత క్రికెట్‌నే కాక సచిన్ కూడా తక్కువ చేసి రాసేవాడు.

కాగా, టెన్నిస్‌ ఎల్బో గాయం కారణంగా సచిన్‌ కెరీర్లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ నొప్పి అతణ్ని ఎంతగా బాధించేదంటే మాములుగా మింగాల్సిన పెయిన్‌ కిల్లర్‌ మాత్రలను సచిన్‌ నమిలేవాడట. అలా చేస్తేనైనా అవి త్వరగా పని చేసి ఉపశమనం కలిగిస్తాయోమోనని అనుకునేవాడట.

English summary
Your brother took our cricket back by five years, Sachin Tendulkar told Ian Chappell.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X