విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వరూపానంద సరస్వతితో జగన్:ఆంతర్యం?(ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించడం అందరినీ అశ్చర్యంలో ముంచెత్తింది. ఆశ్రమం వార్ఠికోత్సాల సందర్భంగా ఆయన శారదా పీఠానికి వెళ్లారు. ఆయన శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతిని కలిశారు.

ఆయన స్వామి స్వరూపానంద స్వామికి సన్నిహితం కావడానికే అలా వెళ్లినట్లు భావిస్తున్నారు. పలు కారణాల వల్ల 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కొన్ని వర్గాలు దూరమయ్యాయి. దాంతో ఆ వర్గాన్ని తిరిగి తన వైపు రాబట్టుకోవడానికి ఈ సందర్శన పనికి వస్తుందనే వాదన వినిపిస్తోంది.

స్వరూపానంద స్వామికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణంగా కూడా జగన్ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరై ఉండవచ్చునని అంటున్నారు. నిజానికి, శారదా పీఠం ఆహ్వానం మేరకే జగన్ అక్కడికి వెళ్లారు. అయితే, తాము అడిగిన వెంటనే వార్షికోత్సవాలకు రావడానికి జగన్ అంగీకరించడం పీఠం నిర్వాహకులను కూడా ఆశ్చర్యపరిచినట్లు వార్తలు వచ్చాయి.

ఒకే ఎజెండా..

ఒకే ఎజెండా..

శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావడం తప్ప మరో కార్యక్రమం విశాఖపట్నంలో వైయస్ జగన్‌కు లేదని అంటున్నారు.

సింహాచలం సందర్శన

సింహాచలం సందర్శన

స్వామీజి సూచన మేరకు వైయస్ జగన్ తొలుత సింహాచలం ఆలయాన్ని సందర్శించుకుని ఆ తర్వాత శారదా పీఠానికి చేరుకున్నారు

తీర ప్రాంత సందర్శన

తీర ప్రాంత సందర్శన

వైయస్ జగన్ విశాఖపట్నంలో తీర ప్రాంతాన్ని సందర్శించారు. కోతకు గురైన తీరాన్ని సందర్శించి, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.

ఆహ్వానం అందిన తర్వాత

ఆహ్వానం అందిన తర్వాత

శారదా పీఠం నుంచి ఆహ్వానం అందిన కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పీఠాన్ని సందర్శించి తమ నాయకుడు జగన్ వార్షికోత్సవాలకు వస్తారని నిర్వాహకులకు చెప్పారు.

30వరకు ఉత్సవాలు

30వరకు ఉత్సవాలు

శారదా పీఠం వార్షికోత్సవాలు ఈ నెల 26వ తేదీన ప్రారంభమయ్యాయి. అవి ఈ నెల 30వ తేదీ వరకు సాగుతాయి.

ప్రైవేట్‌గా స్వామీజీతో..

ప్రైవేట్‌గా స్వామీజీతో..

మంగళవారంనాడు వైయస్ జగన్, మరి కొంత స్థానిక అనుచరులతో కలిసి స్వామీ స్వారూపానంద సరస్వతి బోధనలను ప్రైవేట్‌గా విన్నారు.

ఆశ్రమమంతా చూశారు..

ఆశ్రమమంతా చూశారు..

జగన్ శారదా పీఠం ఆశ్రమంలో తిరిగారు. ఆయనకు ఆశ్రమాన్ని నిర్వాహకులు చూపించారు. కొంతసేపు ఆయన చండీయాగం నిర్వహించే యాగశాలలో గడిపారు.

రక్షబంధనం కట్టారు..

రక్షబంధనం కట్టారు..

స్వరూపానంద సరస్వతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రక్ష కుడా కట్టారు. కుడి చేయి మణికట్టుకు ఆ రక్షను కట్టారు.

జగన్‌కు సాదర ఆహ్వానం

జగన్‌కు సాదర ఆహ్వానం

శారదా పీఠంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సాదరమైన ఆహ్వానం లభించింది. ఓ వర్గానికి దూరమవుతున్న భావన నుంచి ఆయన బయటపడడానికి ఇది పనికి వస్తుందా అనేది చర్చగా మారింది.

అనూహ్యంగా జగన్

అనూహ్యంగా జగన్

అనూహ్యమైన రీతిలో వైయస్ జగన్ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావడానికి అంగీకరించారనే మాట వినిపిస్తోంది.

జగన్‌తో స్వరూపానంద సరస్వతి

జగన్‌తో స్వరూపానంద సరస్వతి

శారదా పీఠం ఆశ్రమంలో వైయస్ జగన్మోహన్ రెడ్డితో స్వామి స్వరూపానంద సరస్వతి సన్నిహితంగానే మెలిగారు.

జగన్ భక్తిభావంతో...

జగన్ భక్తిభావంతో...

విశాఖపట్నంలోని శారదా పీఠం ఆశ్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత భక్తిశ్రద్థలతో వ్యవహరించారు.

జగన్ వ్యూహరచన..

జగన్ వ్యూహరచన..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 2014 ఎన్నికల్లో ఓ రకమైన మత ముద్ర పడిుంది. దాన్ని దూరం చేసుకోవడానికి ఆశ్రమ సందర్శన పనికి వస్తుందని భావిస్తున్నారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా

ఉల్లాసంగా, ఉత్సాహంగా

..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శారదా పీఠం ఆశ్రమంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు

రెండు చేతులూ జోడించి...

రెండు చేతులూ జోడించి...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వేషధారణ కూడా భక్తిభావం ఉట్టిపడేలా ఉంది. ఆయన నుదుట బొట్టు పెట్టి దండం పెడుతూ ఆయన కనిపించారు.

ఆర్కే బీచ్ సందర్శన

ఆర్కే బీచ్ సందర్శన

విశాఖ నగరంలో ఆర్కే బీచ్ కోతకు గురికావడానికి కారణాలేమిటనే విషయమై సమగ్ర అధ్యయనం జరిపి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సగానికి పైగా తీర ప్రాంతం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
YSRC chief Y.S. Jagan Mohan Reddy’s visit to Sarada Peetham in Vizag to take part in the ashram’s anniversary celebrations on Tuesday has raised many eyebrows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X