వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16మందితో జగన్ ఒక్కడే ఫైట్: తట్టుకోలేకపోయిన బాబు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వైసిపి అధినేత జగన్ ఒక్కడే అధికార టిడిపి సభ్యులతో వాగ్యుద్ధానికి దిగారు. అసెంబ్లీలో బుధవారం రాజధాని భూదందా, జగన్, చంద్రబాబు ఆస్తులు తదితరాల పైన వాడిగావేడిగా చర్చ జరిగింది.

సభలో వైసిపి తరఫున జగన్ ఒక్కడే మాట్లాడారు. టిడిపి నుంచి మాత్రం సీఎం చంద్రబాబు సహా పలువురు సభ్యులు మాట్లాడారు. తమ పార్టీ తరఫున తాను ఒక్కడినే మాట్లాడుతున్నానని, మాట్లాడనివ్వాలని జగన్ పలుమార్లు చెప్పారు. జగన్ ఒక్కడే మాట్లాడటాన్ని టిడిపి సభ్యులు కూడా ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షం నుంచి ఏం తెలియని జగన్ ఒక్కడే మాట్లాడుతున్నారని, తెలిసినవారు మాట్లాడాలని, జగన్ తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కూడా. అయినప్పటికీ.. సభలో బుధవారం నాడు 16 మంది టిడిపి నేతలతో జగన్ ఒక్కడే మాటల యుద్ధానికి దిగారు.

గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న సమయంలో... వైసిపి నుంచి ఒకేఒక్కడిగా జగన్ ప్రసంగించారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పలుమార్లు ప్రతిస్పందించారు.

మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి జగన్ ప్రసంగం ప్రారంభం కాగా, ఆయన సుదీర్ఘ ప్రసంగం సాయంత్రం 4:20 గంటల వరకూ సాగింది. ఈ మధ్యలో ఆయన ఆరోపణలు చేసినప్పుడల్లా.. మంత్రులు, ఎమ్మెల్యేలు మైక్ తీసుకుని కౌంటర్ ఇచ్చారు.

జగన్ ఆరోపణలకు ఘాటుగా సమాధానం చెప్పిన వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అచ్చన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దూళిపాళ్ల నరేంద్ర, బోండ ఉమ తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో తొలుత వైయస్ జగన్ ప్రభుత్వంపై పైచేయి సాధించినట్లుగా కనిపించింది. అయితే, తన ప్రసంగంలో... మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు రాజధానిలో భూదందాకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు.

అప్పటి నుంచి టిడిపి జగన్ పైన ఎదురుదాడికి దిగింది. మొదట పైచేయి సాధించిన జగన్.. మంత్రుల పేర్లు ప్రస్తావించడంతో ఇరుకునపడ్డారు. సాక్షి మీడియాలో భూదందా పైన ఆరోపణలు, కథనాలు రావడం వేరు. సభలో మంత్రుల పైన అసత్యాలు చేయడం వేరు. కాబట్టి దీనిని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో జగన్ పైన ఊగిపోయారు. ఆరోపణలు నిరూపించాలి లేదా జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు పట్టుబట్టారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

జగన్‌ తొలి నుంచీ రాజధాని ప్రాంతంపై విషం చిమ్ముతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు సభలో బుధవారం ధ్వజమెత్తారు. రాజధాని భూములపై ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సర్వే నెంబర్లతో సహా అన్ని ఆధారాలను బయటపెట్టాలని, నిరూపించలేకపోతే సభాపతే శిక్ష వేస్తారని స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

బట్ట కాల్చి ముఖాన వేయడమేమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై జగన్‌ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

అనంతరం ధన్యవాద తీర్మానంపై చేసిన ప్రసంగంలోనూ చంద్రబాబు ప్రతిపక్ష ఆరోపణలపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారం మాట్లాడితే జగన్‌పై చర్యలు తీసుకుంటామని, తోక జాడిస్తే ఉపేక్షించేది లేదని, అవినీతి బురదలో కూరుకున్నవాళ్లు ఆ బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారన్నారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసి కావాల్సినవాళ్లు, బినామీల ద్వారా తక్కువ ధరకే భూములను కొనిపించారని, ఇది ప్రమాణ స్వీకారంలో పేర్కొన్న అధికార రహస్యాల్ని ఉల్లంఘించడమేనని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కంటే పెద్ద కుంభకోణమని జగన్‌ సభలో ఆరోపించారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం తనవాళ్ల భూములను స్థిరాస్తి జోన్‌లోనే ఉంచి, రైతుల భూముల్ని అగ్రి జోన్‌లో పెట్టారని, మంత్రి పుల్లారావు బినామీ పేర్లతో భూములు కొన్నారని ఆరోపించారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

నాకు రూ.43వేల కోట్ల ఆస్తులున్నాయని అంటున్నారని, అందులో పావలా భాగం ఇచ్చేస్తే.. మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతానని జగన్ అన్నారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

1978లో చంద్రబాబు రాజకీయాల్లోనికి వచ్చినప్పుడు ఆయన ఆస్తి కేవలం రెండు ఎకరాలే ఉందని, ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని జగన్ ప్రశ్నించారు.

 ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

పక్క జిల్లాకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలు, జెట్‌లు, విదేశాలకు వెళ్తే ఛార్టెర్డ్‌ విమానాలు, కూడా ఓ సైన్యం, వారిని మేపడానికి భారీ వ్యయం అవుతుందని, పోలవరం 2018లో పూర్తి చేస్తానంటూ తాత్కాలికంగా పట్టిసీమ అంటారని, సచివాలయానికి తాత్కాలిక భవనాలు.. ఇలా అన్నింటా కోట్ల రూపాయల దుబారా ఖర్చే చేస్తున్నారని చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు.

English summary
YS Jagan war of words with Chandrababu and TDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X