వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది విధేయత చూపడం కాదా?: విజయసాయికి ప్రశ్న, జగన్ వర్సెస్ బాబు మీడియా

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రధానిని, ప్రధాని కార్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు

న్యూఢిల్లీ/అమరావతి: టీడీపీ-వైసీపీ మధ్య ఫైట్ అంటే.. వారి అనుకూల మీడియా మధ్య ఫైట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎవరి అనుకూల మీడియాలో వాళ్ల గొంతులు బలంగా వినిపించుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి ఈ రెండు పార్టీలు.. వాటిని బాగా ఉపయోగించుకుంటున్నాయి.

హోదాపై పోరు ఉధృతమవుతున్నవేళ పత్రికల మధ్య ఫైట్ కూడా హీటెక్కుతోంది. టీడీపీని దోషిగా నిలబెట్టేందుకు జగన్ మీడియా, వైసీపీని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు అనుకూల మీడియా శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై టీడీపీ అనుకూల మీడియా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

సభా హక్కుల ఉల్లంఘనపై నోటీసు:

సభా హక్కుల ఉల్లంఘనపై నోటీసు:

ప్రధాని నరేంద్ర మోడీతో తాను భేటీ అయితే.. ఆర్థిక నేరస్తులతో పీఎంకి పనేంటి? అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా పరిగణించారు. చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. టీడీపీ నేతలు అరుణ్ జైట్లీని కలిస్తే తప్పు లేదు కానీ.. తాను ప్రధానితో భేటీ అయితే తప్పేంటని విజయసాయి ప్రశ్నిస్తున్నారు.

ఇది విధేయత చూపడం కాదా?:

ఇది విధేయత చూపడం కాదా?:

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. మోడీపై విధేయతను చాటుకోవడమే అని టీడీపీ అనుకూల మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఒకవైపు మోడీ సర్కారుపై అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూనే.. మరోవైపు ఆయనకు దగ్గరవడానికి వైసీపీ ఆరాటపడుతున్నట్టుగా అందులో పేర్కొన్నారు.

అంతేకాదు, ఎవరైనా తమ హక్కుల కోసం మాట్లాడుతారని, కానీ విజయసాయి మాత్రం మోడీ హక్కులకు భంగం కలిగినా ఊరుకునేది లేదని చెబుతున్నారని ప్రస్తావించారు. ఇదంతా మోడీకి దగ్గరయ్యే ప్రయత్నమే తప్ప మరొకటి కాదనే ఉద్దేశం ఆ కథనంలో కనిపిస్తోంది.

ఇంతకీ విజయసాయి ఏమన్నారు?:

ఇంతకీ విజయసాయి ఏమన్నారు?:


ప్రధానిపై, తనపై సీఎం చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏపీలో టీడీపీకి అధికారాన్ని దూరం చేయాలని మోడీ కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

అసెంబ్లీలో, బహిరంగ సభలోనూ తమపై విమర్శలు చేశారన్నారు. నాపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నందునా.. వాటి నుంచి బయటపడేందుకు ప్రధానితో సన్నిహిత సంబంధాల కోసం పాకులాడుతున్నానని చంద్రబాబు ఆరోపించడాన్ని తప్పు పట్టారు. ప్రధానిని కలిసి తర్వాతే కొన్ని కేసుల్లో పీఎంఎల్‌ఏ ట్రైబ్యునల్‌ అనుకూల తీర్పులు ఇచ్చిందని చెప్పడాన్ని ఆయన ఖండించారు.

ప్రజాస్వామ్యంపై దాడి

ప్రజాస్వామ్యంపై దాడి

చంద్రబాబు నేరుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విజయసాయి మండిపడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని నేరస్తుల అడ్డా అనడాన్ని తప్పు పట్టారు. ప్రధాని, ప్రధాని కార్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి ఇచ్చిన హామిల కోసం చర్చించడానికే ప్రధానితో భేటీ అయినట్టు తెలిపారు. ప్రధానితో భేటీ తర్వాత కోర్టులు అనుకూల తీర్పులు ఇచ్చాయన్న చంద్రబాబు ఆరోపణలను ఆయన ఖండించారు. అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లకు రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులు నేతృత్వం వహిస్తారని, అవి స్వతంత్ర సంస్థలని చంద్రబాబు గుర్తించడం లేదని మండిపడ్డారు.

English summary
YSRCP Rajysabha member Vijayasai Reddy moves privilege notices to Rajyasabha chairman Venkaiah Naidu against Chandrababu Naidu for insulting PM Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X