• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుమల కొండ

By Staff
|

ప్రముఖులసందేశాలు

జీయర్‌ స్వామిసందేశం

ప్రియ శ్రీమాన్‌ పి.కృష్ణమూర్తి గారూ!
శ్రీమతే నారాయణాయ
అనేక మంగళ శాసనములు

తాము తయారు చేసిన పద చిత్రాలు గ్రంధం చాలా అందంగాను, అవగాహనాప్రదముగానువస్తోంది. చాలా బాగుంది.

ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధిపరచుకొంటూ, ఆనందంగా సమాజంలో నొప్పించక,తానొవ్వక జీవించేట్టు చేసే ఆలయాలు ఈరోజులలో ఆర్జన కేంద్రాలుగా మారుతున్నాయి.ఆరాధ్యదైవం ఎప్పుడూ అనుగ్రహాన్నికురిపిస్తునే వున్నా అందుకోలేని స్థితిలో అర్థపరులైఅటు ఆలయ నిర్వాహకులు, ఇటు అర్చనాదులు నిర్వహించేవైదికులు, అధికారులు కూడా భౌతిక దృష్టితో జీవితాలు గడుపుతున్నారు. భక్తులకు కూడాఆలయాలంటే ఏదో తెలియని అదృష్టాన్ని ఎక్కడినుంచో ఆకాశంలోంచి ఎలాగోలాగ కురిపించక పోతాయా!అనే ఆశతో, అలా జరిగితే ఆ ఆలయాలను ఆదరించడం, జరగక పోతేదానిని వదిలి మరో ఆలయాన్ని ఆశ్రయించడంవంటివి అలవాటయ్యాయి.

ఇన్నిటినీ సహిస్తున్నకృపాళువైన సర్వ జగన్నాధుడు ఆలయంలోఅర్చామూర్తిగా వీళ్ళేంచేస్తే అదే తనకు సర్వమనే రీతిలో,ఇది తప్ప వేరే గతిలేదనే పారతంత్య్రం మూర్తీభవించిఅలానే గమనిస్తున్నాడు. ఇలాంటి స్థితి చిన్న చిన్నఆలయాల్లో అక్కడి అర్చామూర్తులకు మాత్రమేకాక, కలియుగ నాయకుడైన శ్రీశ్రీనివాసునికి కూడా తప్పడంలేదు. ఎక్కడైనా తానుతానే కదా!

ఎప్పుడు మేల్కొంటాడో, నైవేద్యాలందుకుంటాడో,పవ్వళిస్తాడో ఆయనకే తెలియనంతగాపరాధీనుడేపోయి వున్నాడు. అయినా భక్తవత్సలుడే కనుకతాను తిన్నా మానినా శిశువు కడుపు నింపి.... నిద్దురపుచ్చి పొంగిపోయే తల్లిలా,దర్శించే లక్షలాది భక్తుల ఆర్తుల మొరలను పాలించిమురిపిస్తునే వున్నాడు. తనే కాక తనకొండను కూడా అంత శక్తి కలదిగానూ అనుగ్రహించాడు.అందుకే అది వేంకటాద్రి అయింది తాను కూడా వేంకటాచలపతి అయినాడు.దానిని తెలిపే భక్త, భాగవత, ఆళ్వారులనుపంపి, వారి గానామృతాలతో అన్నమయ్య వంటిపద కవితా పితామహులను తయారు చేసుకున్నాడు.

భగవత్‌ రామానుజస్వామివంటి ఆచార్యుల అండతో శంఖచక్రధారిగ, ఉత్తమవైష్ణవునిగ, జాతిమత, లింగబేధాలను పాటించకఅందరినీ ఏకరీతిగా అనుగ్రహిస్తూ, తన విశ్వకుంటుంబాన్ని పెంచుకుంటున్నాడు. తన కొండపై ప్రతిశిలా, పత్రమూ,పుష్పమూ, క్రిమికీటకమూ ఓ నిత్యసూక్తులై నిలిచేటట్లు చేసుకున్నాడు.అందుకే అది తిరుమలై, సంపదలనిచ్చే కొండఅయింది. అక్కడ వున్న వారికీ, వచ్చే వారికి, చేసేవారికి, అందరికీ అది తిరుమలయే. ఇటు బాహ్యసంపదలే కాక అనంతమైన ఆధ్యాత్మికసంపదలూ ఇవ్వగల తిరుమల అది.

అందుకే ఆ మలైపై ఏ ఏ మూల ఏమేమి ఉన్నాయో,వాటి వైభవం ఏమిటో, అవి ఎలా వున్నాయో తెలుసుకోవడంఉజ్జీవించగోరే వాడి లక్షణం. ఆ లక్షణాన్నిజనులచే గుర్తింప చేసే బాధ్యతను తాము తీసుకున్నట్లులేదా, శ్రీనివాసుడే తమను ప్రేరేపించినట్లు,శ్రీమాన్‌ కృష్ణమూర్తి గారూ, మీరు స్వీకరించి, ఎన్నోప్రయాసలకోర్చి అతి సుందరంగా మీరు పద చిత్రాలనుఅమర్చారు. శ్రీనివాసుని పదాలను చిత్రంగా మదిలోఅమర్చుకోగలిగే రీతిలో గ్రంధం తయారుచేశారు. తిరుమలనే మదిలో నింపేటంత లలితంగావుంది మీ కూర్పు. అయితే తొలిపలుకులలో కుంభకోణంలో జరిగిన శ్రీ భక్తి సారులఐతిహాసిక ఘటనను మీరు 8వ శతాబ్దపు కాంచీపుర సంఘటనగా సుచించడం,పేరులో మార్పు బహుశః అనుకోకుండా దొర్లినవికావచ్చు.

మొత్తానికి తిరుమల గురించిన ఓ సమగ్రఅవగాహనను కల్గించే మీ కృతి శ్రీనివాసుని కృపాపూర్ణముకావాలని, భక్తుల పాలిట కల్పవృక్షము కావాలని ఆశిస్తూమీకనేక మంగంళం శాసనాలు చేస్తున్నాం.

జైశ్రీమన్నారాయణ

చినశ్రీమన్నారాయణ

  • పుస్తకంలోని విశేషాలు-అపురూప చిత్రాలు

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X