వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews
జీవం ఎలా మొదలైంది? అని విజ్ఞాన శాస్త్రాన్నిప్రశ్నించండి. ఆదిలో భూగోళాన్ని సముద్రంకప్పేసి ఉండేది. సముద్రం అలలపై కర్బనపుపొరలు. ఆ పొరలపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఆసంయోగక్రియలో జీవం మొదలైంది....అమీబా,చెట్టూ - పుట్టా, మనము.

జీవం ఎలా మొదలైంది?విశ్వాసులను ప్రశ్నించండి. ఆదిలో చీకటిఅగాధ జలముపైన కమ్మి ఉండెను. దేవునిఆత్మ జలములపై అల్లాడుచుండెను అని బైబిల్‌,ఖురాన్‌లు బదులిస్తాయి. భరతఖండంఏమంటోంది? పాల సముద్రంపై పవళించినదేవా అని జానపదులు, వటపత్రసాయికి వరహాలలాలీ అని తల్లులు, ప్రళయ పయోధి జలేఅని శిష్టులు జీవం ఆవిర్భవించిన ఘట్టాన్ని సాహితీపరిమళంతో చెప్పారు.

సరే, కుజీవం ఆవిర్భవించడానికి సంబంధం ఏమిటి?తిరుమలకొండపై గల నారాయణగిరి శిఖరంసముద్ర మట్టానికి 3,622 అడుగుల ఎత్తులోఉంది. ఈ ప్రాంతమంతా 250 కోట్ల సంవత్సరాలనాడు సముద్రగర్భంలో ఉండేది.భూగోళంపై శిలాతోరణాలు రెండే ఉన్నాయి.ఒకటి తిరుమలలో, మరొకటి ఆఫ్రికాలో.తిరుమల శిలాతోరణం అత్యంత ప్రాచీనమైనదిఅంటారు. ఈ శిలాతోరణం ఏర్పడ్డనాడు ఏడు ఖండాలూఅఖండంగా ఉండేవి. ఐదు సముద్రాలూ ఏకంగాఉండేవి. సృష్టి అప్పటికి ప్లూయిడ్‌గా, నైరూప్యంగాఉంది! గాయత్రి ధరిత్రికి రూపం ఇస్తోంది. నేటికీచెక్కు చెదరని శిలాతోరణం సముద్రపు అలలసవ్వడులను తనలో దాచుకుంది. సముద్రగర్భంలో మాత్రమే ఉండే మొక్కలుతిరుమలలో ఇప్పటికీ ఉన్నాయి. ప్రపంచంలోఇనుమును తొలిసారిగా ఉత్పత్తి చేసినరుజువులున్నాయి.

తిరుమలకొండ గురించి మనుషులజ్ఞాపకాలు ఏమంటున్నాయి? ప్రళయకాలంలో వేదాలునీటిలో ఉన్నాయి. వాటిని వటపత్రశాయి శ్వేతవరాహస్వామి రూపంలో భూమి పైకి తెచ్చారు. ఆచోటు తిరుమల అని వరాహ పురాణంచెబుతుంది. తిరుమల అడవులలో నేటికీశ్వేత వరాహలు పుష్కలం. వేదం అనేపదాన్ని ఆహారంగా భావిస్తే నేలలోపలి దుంపలనువెలికి తెచ్చిన జ్ఞానిగా వరాహస్వామినిగుర్తించవచ్చు. తెలంగాణా, రాయలసీమపల్లెల్లో ఉన్న ఉప్పు-పప్పులను సాహిత్యంఅనడం గమనార్హం. వరాహస్వామినితమిళులు జ్ఞానపిరాన్‌ అంటారు. అంటేజ్ఞానం కలిగిన దైవం అని అర్థం. వైజ్ఞానికంగావిశ్వాసపరంగా తిరుమలకొండ జీవుల తొలిస్థావరం! ను తొలిరోజులలోవేంగడం అనేవారు.

  • పుస్తకంపై ప్రముఖుల కామెంట్స్‌

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X