By : Oneindia Telugu Video Team
Published : April 28, 2017, 06:19

U.P లో ‘యోగి హెయిర్‌కట్’ ఆగ్రహించిన తల్లితండ్రులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో విషయం సంచలనంగా మారుతోంది. యోగీ ఆదిత్యానాథ్ దగ్గర మెప్పుపొందడానికి కొన్ని స్కూళ్లు విచిత్రమైన ఎత్తుగడులు వేశాయి. మీరట్ లోని రిషబ్ అకాడమీ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్ధులను యోగీ ఆదిత్యనాథ్ లాగా హెయిర్ కట్ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చి నిరసనలకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సమస్య పెద్దదవుతుందనుకున్న స్కూల్ యాజమాన్యం మేము అలా చెప్పలేదు. మంచి దుస్తులు వేసుకోవాలని సరైన హెయిర్ కట్ చేసుకోవాలని మాత్రమే చెప్పామని విద్యార్ధులకు మంచి నడవడిక నేర్పడం కోసం చెప్పామే తప్ప మాకు మరో ఉద్దేశం లేదని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా