By: Oneindia Telugu Video Team
Published : December 24, 2017, 05:13

Daily Horoscope 25122017

Subscribe to Oneindia Telugu

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 25 వ తేదీ సోమవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద సప్తమి రాత్రి 8 గంటల 10 నిమిషముల వరకు వుంది. ధనిష్ఠ నక్షత్రం రాత్రి 9 గంటల 15 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయికలుంటాయి. భార్య సహకారం తో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృషభ రాశి వారు చేయు పనులు వాయిదా పడతాయి. పిల్లల వలన తల్లి తండ్రులు ఆనందంగా గడుపుతారు. మిధున రాశి వారికి పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లలు వారి పనులు వారు చూసుకుంటారు. ధన ఇబ్బందులుంటాయి. కర్కాటక రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. ధనం కోసం ప్రణాళికలు వేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి చేయు పనులు శ్రద్ధతో పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. కన్య రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలుతో అయినా పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు వేయవలసి వుంటుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. పని వారి సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి. తుల రాశి వారికి పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం పూర్తిగా వుంటుంది. వృశ్చిక రాశి వారు దానం కోసం ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తల్లి గారి పట్ల శ్రద్ద చూపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ధనూ రాశి వారు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. మకర రాశి వారికి వ్యవహారాల యందు ఆటంకాలు వుంటాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి కోరికలు సిద్దిస్తాయి. సహచరుల సహకారం వుంటుంది.అధికారులు మెప్పు కుడా పొందుతారు. మీన రాశి వారికి చేయు పనులు వాయిదా పడతాయి. మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు.


Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా