By: Oneindia Telugu Video Team
Published : November 09, 2017, 06:12

అన్నయ్యలతో ఉండను అన్న చెల్లి, ఎందుకో తెలుసా ? VIDEO

Subscribe to Oneindia Telugu


తల్లిదండ్రులు చనిపోవడంతో.. ఆ యువతి అన్నయ్యల వద్దే ఉంటోంది. టీచర్ గా పనిచేస్తూ సొంత కాళ్ల మీదే బతుకుతోంది. అయితే కారణాలేంటో తెలియదు గానీ ఇటీవల అన్నా వదినలతో విబేధాలు ఏర్పడ్డాయి. ఆ విభేదాలు ఆమె చేతులకు తాళం వేసి నిర్బంధించేదాకా వచ్చాయి. స్థానికుల సమాచారంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. యువతి మాత్రం తాను అన్నా వదినల వద్ద కంటే అనాథశ్రమంలోనే ఉంటానని చెబుతోంది. దీంతో ఆ యువతికి ఎదురైన కష్టాన్ని చూసి స్థానికులు కూడా చలించిపోతున్నారు.
జగిత్యాల పట్టణంలోని వాణినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన చిట్యాల గీత తన అన్నలైన చిట్యాల నారాయణ, రమేష్‌, శ్రీనివాస్‌ల ఇంట్లో ఉంటోంది. అమ్మ-నాన్నలు చనిపోవడంతో అన్నయ్యలే ఆమె సంరక్షణను చూస్తున్నారు.
ముగ్గురు అన్నయ్యలకు వివాహం అయింది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన గీత కొంతకాలం స్థానిక పాఠశాలలో టీచర్ గా పనిచేసింది. ఆ తర్వాత ఆమె చేతులకు తాళాలు వేసి ఇంట్లోనే బంధించారు. బుధవారం ఆమె ఇంట్లో నుంచి తప్పించుకుని బయటకు రావడంతో.. విషయం వెలుగుచూసింది. ఇటీవల అన్న, వదినల వేధింపులు ఎక్కువయ్యాయని కాలనీవాసులతో వాపోయింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా