By : Oneindia Telugu Video Team
Published : November 15, 2017, 11:19

ప్రేమోన్మాది ఎంతకి తెగించాడంటే?

ఓ ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో యువతి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమెకు నిప్పంటించి కాల్చి చంపేశాడు. ఆపై ఆమె కుటుంబ సభ్యులకూ నిప్పంటించాడు. చెన్నై నగర శివారులోని ఆదంబాక్కంలోని శాస్త్రినగర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఆదంబాక్కంలోని శాస్త్రినగర్‌ 7వ వీధికి చెందిన షణ్ముఖం-రేణుక దంపతులలకు ఇందుజ(21), నివేదిత అనే ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇందుజ స్కూల్లో ఉన్నప్పటి నుంచే వేళచ్చేరికి చెందిన ఆకాష్‌(22) అనే యువకుడితో ప్రేమలో ఉంది.
కొద్దిరోజుల క్రితం ఇందుజ ప్రేమ వ్యవహారం వాళ్లింట్లో తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో అప్పటినుంచి ఇందుజ ఆకాష్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇందుజపై ఆకాష్ కక్ష పెంచుకున్నాడు. ఇందుజ మాట్లాడకపోయినా సరే.. ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఇందుజ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
సోమవారం రాత్రి 8.45గం.కు ఆకాష్ ఇందుజ ఇంటికెళ్లాడు. ఇందుజను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు వారు ఎలా స్పందించారో తెలియదు గానీ.. ఆకాష్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. తన వెంట తీసుకెళ్లిన టర్పంటాయిల్ ను తొలుత ఇందుజపై, ఆ తర్వాత ఆమె తల్లి రేణుక, చెల్లి నివేదిత, తమ్ముడిపై కుమ్మరించాడు. ఆ సమయంలో ఇందుజ తండ్రి ఇంటివద్ద లేడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా