By: Oneindia Telugu Video Team
Published : November 30, 2017, 02:41

ఇద్దరూ ఒకే మహిళతో!: సెప్టిక్ ట్యాంకులో శవమై !

Subscribe to Oneindia Telugu

బతుకుదెరువు కోసం వలసవెళ్లిన ఓ వ్యక్తి అక్రమ సంబంధం ఉచ్చులో చిక్కుకుపోయి బలైపోయాడు. అవసరం కోసం విచ్చలవిడి తనానికి అలవాటుపడ్డ మహిళ చివరాఖరికి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. తోటి కార్మికుడు తనకంటే ఎక్కడ పైకి ఎదుగుతాడేమోనన్న అక్కసు మరో కార్మికుడి చేత హత్య చేయించింది. మొత్తంగా ఒక్క హత్య ఆ ముగ్గురి కుటుంబాలను రోడ్డున పడేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరు ఎన్‌టిఆర్‌.కట్టపై హత్య ఘటనలో వెలుగుచూసిన విషయాలివి.తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దామవరపు మండలం రామకృష్ణాపురానికి చెందిన మార్కండి రాజయ్య(35) బతుకుదెరువు కోసం 10ఏళ్ల క్రితం విజయవాడ వచ్చాడు. స్థానికంగా ఓ లిక్కర్‌ డిపోలో ముఠా కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంకొండకు చెందిన సుధాకర్‌ కూడా అదే డిపోలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు.
తాడేపల్లి కొత్తూరుకి చెందిన చిక్కల కమలగాయత్రి అనే యువతి వీరు పనిచేసే లిక్కర్ డిపో వద్ద పగిలిపోయి సీసా పెంకులు ఏరుకునేది. వాటిని అమ్ముకుని జీవనం సాగించేది. ఈ క్రమంలో సుధాకర్, రాజయ్యలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గాయత్రి అవివాహితురాలు కావడంతో ఇద్దరూ ఆమెకు దగ్గరయ్యారు. గాయత్రి కూడా ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం సాగించింది. ఈ క్రమంలో ఆమెకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. గాయత్రి విషయంలో రాజయ్య-సుధాకర్ ల మధ్య ఓసారి గొడవ జరిగింది. ఇద్దరూ గొడవపడుతుండటంతో డిపో వద్ద పని మానేసి తాడేపల్లిలోని అపార్ట్ మెంట్లలో గాయత్రి పనికి కుదిరింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా