By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 05:00

మండలస్థాయి గ్రీవెన్స్ సెల్: మృణాళిని

Subscribe to Oneindia Telugu

భూ వివాదాల పరిష్కారంలో, 16 రకాల ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో తలెత్తే సమస్యలను సరవేగంగా పరిష్కరించేందుకు మండల స్థాయిలో రెవెన్యూ గ్రీవెన్ సెల్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు. అవినీతిని, లంచాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నిర్ధేశిత కాలంలో ఆ సమస్యలను పరిష్కరించడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా సంబంధీకుల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయనగరంలో డివిజన్ స్థాయి రెవెన్యూ సదస్సుని ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా