By : Oneindia Telugu Video Team
Published : December 09, 2017, 04:32

20 దెయ్యాలతో శృంగారం! దిమ్మతిరిగే నిజాలు...!

దెయ్యం అంటేనే చాలామందికి భయం. అలాంటిది ఏకంగా దెయ్యంతో శృంగారం అంటే.. ఎలా ఉంటుంది? కానీ ఓ మహిళ మనుషులతో కంటే దెయ్యాలతోనే శృంగారం బాగుంటుందని సెలవిస్తోంది. అదేంటి అంటే, అంతేమరి.. మనిషి తోడు ఎలాగూ లేదు, కనీసం దెయ్యాలతోనైనా ఎంజాయ్ చెయ్యొద్దా? అని ఎదురు ప్రశ్నిస్తోంది. అరె, అసలు దెయ్యం కంటికే కనిపించదు, ఇక దెయ్యంతో శృంగారమా? అంతా అబద్ధం అని కొట్టిపారేయకండి. కంటికి కనిపించకపోతే ఏం.. ఒంటికి స్పర్శ తెలియదా? అని ఎదురు ప్రశ్నిస్తోంది ఈ మహిళ. పైపెచ్చు మనుషులతో కలిగే అనుభూతే.. వాటితోనూ అంటూ ముసిముసిగా నవ్వేస్తోంది.
వివరాల్లోకి వెళితే యూకేలోని బ్రిస్టల్‌లో అమెథిస్ట్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సెలర్‌గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. ఆ సమయంలో వాళ్లు కొత్తగా ఓ ఇల్లు కొనుక్కున్నారట. అమెథిస్ట్ భర్త ఏమో ఎక్కువగా ఇంటిపట్టున ఉండేవాడు కాదు. టూర్ అంటూ నెలలో ఎక్కువ రోజులు అటూ ఇటూ తిరుగుతుండే వాడు. దీంతో అమెథిస్ట్ తమ కొత్త ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. విశాలమైన ఇల్లు.. అందులో ఒంటరిగా అమెథిస్ట్. ఆ ఇంట్లో ఓ దెయ్యం ఉండేదట. రాత్రిళ్లు ఒంటరిగా ఉండే అమెథిస్ట్‌తో ఆ దెయ్య పరిచయం పెంచుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా