By : Oneindia Telugu Video Team
Published : November 09, 2017, 03:38

దానిక్కూడా "ఆధార్‌" తప్పనిసరి అంట తెలుసా ?

బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నెంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇన్సూరెన్స్ పాలసీని కూడ ఆధార్‌తో అనుసంధానం చేయాలనే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని విషయాల్లో ఆధార్‌ అమలు చేయడం తప్పనిసరిగా తేల్చి చెప్పింది. సంక్షేమ పథకాల లబ్ది కోసం ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెలిఫోన్ నెంబర్‌ను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని గడువు ఇచ్చింది. తాజాగా మరో షాక్ వచ్చి పడింది.
బీమా పాలసీలతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్‌ అనుసంధానం చేయడం తప్పని సరి అని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌మనీ లాండరింగ్‌ చట్టం 2017సవరించిన నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరని తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని బీమా సంస్థలకు సమాచారాన్ని అందించింది. అలాగే బీమాపాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని పాలసీదారులను కోరింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా