By: Oneindia Telugu Video Team
Published : October 31, 2017, 06:20

దోచుకోవడమే కాదు అణిచివేత దిశగా ...తెలంగాణలో అవినీతి పాలన

Subscribe to Oneindia Telugu

దోచుకోవడమే కాదు అణిచివేత దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నారని ఆత్మీయ సమ్మేళనానికి హాజరయిన పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి కూడ హజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించేందుకు ఉత్తమ్ ఈ సమావేశానికి హజరయ్యారు.రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక టిడిపి నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. రేవంత్‌తో పాటు టిడిపి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు.టిఆర్ఎస్‌ పాలనకు గోరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నడుంబిగించిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి అన్నారు. కెసిఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు తమతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉత్తమ్‌ టిడిపి నేతలను ఆహ్వనించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పాస్ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేసిందో ఉత్తమ్ వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడ న్యాయం జరగలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.ఏ రాష్ట్రంలో లేని అవినీతి తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకొంది. తెలంగాణ సమాజ మానవహక్కులను కెసిఆర్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డి ఆరోపించారు.టిఆర్ఎస్‌ను గద్దెదింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ సమక్షంలో అక్టోబర్ 31వ,తేది మధ్యాహ్నం 12 గంటలకు రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వనిస్తున్నట్టు ప్రకటించారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా