By: Oneindia Telugu Video Team
Published : July 22, 2017, 04:22

తండ్రి అయిన ab డివిలియర్స్ .. ఫుల్ హ్యాపీ

Subscribe to Oneindia Telugu

దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ దంపతులు శుక్రవారం తమ రెండో బిడ్డకు స్వాగతం పలికారు. డివిలియర్స్ భార్య డేనియల్ జోహెన్స్ బర్గ్‌లోని ఓ స్ధానిక ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ మేరకు ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
బాబుకి జాన్ రిచర్డ్ డివిలియర్స్ అని పేరు పెట్టామని తెలిపాడు. 'మేము ఇప్పుడు నలుగురం. మా జీవితాల్లోకి కొత్త వెలుగుని నింపినందుకు దేవుడుని ప్రార్ధిస్తున్నాం. జాన్ రిచర్డ్ డివిలియర్స్ సోమవారం (17th జులై) 11 గంటలకు జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు' అని ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా