By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 09:33

రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు

Subscribe to Oneindia Telugu

ప్రాజెక్టు కాల్వ క్రింద భూమి కోల్పోయిన రైతుకు పరిహరం చెల్లించేందుకు లంచం అడిగి ఓ అవినీతి అధికారి బాదితుడినుండి 5000 వేల రూపాయులు తీసుకుంటు రెడ్‌ హ్యాండెడ్‌ గా ఏసిబి కి చిక్కిన ఘటన కరీంనగర్‌ లో చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా మానకోండూర్‌ మండలం నిజాయితి గూడెంకు చెందిన గడ్డి కుమారస్వామి అనే రైతుకు చెందిన వ్యవసాయభూమి పదిహేను గుంటల స్థలం మిడ్‌ మానేర్‌ కుడికాల్వ నిర్మాణంలో ప్రభుత్వం సేకరించింది. అందుకుగాను ప్రభుత్వం నిర్వాసితుడికి 2 లక్షల 62 వేల500 రూపాయలు కెటాయించింది. నిర్వాసితుడికి తన భూమి ప్రభుత్వానికి రిజిస్టరు చేసిన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని నిబందనలు ఉన్నా అవినీతికి అలవాటు పడ్డ అధికారులు అలా చేయకుండా తమ చేతివాటం ప్రదర్శించారు. అధికారుల తీరుతో విసుగుచెందిన బాధితుడు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా