• search
By : Oneindia Telugu Video Team
Published : January 30, 2018, 04:18
Duration : 02:59

అనుష్క ఆన్‌స్క్రీన్ భర్త అరెస్ట్, సైకో, గే, రాత్రుళ్లు చాటింగ్

టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదయింది. భార్య ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇంట్లో దొంగతనం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.నటుడు సామ్రాట్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఇది రెండోసారి. గతంలో భార్య వరకట్నం కేసు పెట్టగా, ఈసారి దొంగతనం కేసు పెట్టింది. ఆ కేసు విచారణ జరుగుతుండగా ఈ కేసు నమోదు కావడం గమనార్హం.
గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా భార్య అతనిపై వరకట్నం కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498/ఏ కింద ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తాజాగా దొంగతనం కేసు .ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. దీంతో మంగళవారం ఉదయం అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. సామ్రాట్ రెడ్డితో పాటు అతడి సోదరి సాహితీ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కొంతకాలంగా సామ్రాట్‌కు అతని భార్యతో విభేదాలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు.
తాను ఇంట్లో లేని సమయంలో సామ్రాట్ వచ్చి.. తనకు చెందిన వస్తువులుగా చెబుతూ పలు విలువైన వస్తువులను తీసుకు వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు.సామ్రాట్ పలు తెలుగు చిత్రాల్లో నటించారు. వీరి పెళ్లి కొంతకాలం క్రితం జరిగింది. ఈ వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వారు ఆ తర్వాత భార్యా, భర్తల మధ్య గొడవ వచ్చినట్లుగా తెలుస్తోంది.
తన భర్త సామ్రాట్ రెడ్డిపై భార్య హర్షిత తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త చాలా దుర్మార్గుడని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను కేసు పెట్టానని చెప్పింది. ఎంతో సహనంగా, ఎన్ని కష్టాలు పెట్టినా మౌనంగా ఉన్నానని, ఓ సైకోలా మారి హింసించాడని దీంతో విధిలేని పరిస్థితుల్లోనే దూరంగా ఉన్నానని వాపోయింది.వాస్తవానికి నటుడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకున్నా, ఆ రంగం నుంచి బయటకు వస్తానని సామ్రాట్ చెప్పడంతో పెళ్లాడినట్లు హర్షిత చెప్పింది. తన అత్త కూడా ఎంతో వేధించేదని ఆరోపించింది. కట్నం తీసుకు రావాలని వేధిస్తున్నందున గతంలో కేసు పెట్టానని ఆరోపించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more