By: Oneindia Telugu Video Team
Published : December 11, 2017, 01:18

దంగల్ నటి కి విమానంలో వేధింపులు, Video

Subscribe to Oneindia Telugu

దంగల్ చిత్ర నటి జైరా వాసిమ్ విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను వేధించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిని 39 సంవత్సరాల ముంబై వ్యాపారవేత్త వికాస్ సచ్ దేవ్‌గా గుర్తించారు. బాధితురాలు జైరా వయసు 17 సంవత్సరాలు. అతనిపై పోస్కో సహా పలు సెక్షన్లపై కేసు పెట్టినట్టు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అనిల్ వెల్లడించారు.
ఆతనిని సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, విమానంలో తన సీటు హ్యాండ్ రెస్ట్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలు పెట్టాడని, మెడ, చేతులు, వీపుపై అసభ్యంగా తాకాడని జైరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కంటతడి పెడుతూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై విస్తారా విమానయాన సంస్థ కూడా స్పందించింది. ఈ తరహా సంఘటనలను తాము ప్రోత్సహించమని, విచారణలో జైరాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపింది. దీనిమీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అందరూ నటికి తమ సపోర్ట్ అందిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా