By : Oneindia Telugu Video Team
Published : November 21, 2017, 11:24

అఖిలపై బాబు సంచలనం : రాజీనామా చెయ్యమనే ?

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మంత్రి అఖిలప్రియకు గట్టి ఝలక్ ఇచ్చారు. తోటి మంత్రులు, అధికారుల ముందు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అఖిల కంగు తిన్నారు. పది రోజుల క్రితం కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 22 మంది మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా, చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా 22 మంది అమాయకుల ప్రాణాలు పోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అన్ని శాఖలు సరిగా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ సమయంలో మంత్రి అఖిలప్రియను ఉద్దేశించి కూడా చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో శాఖాపరమైన బాధ్యతలకు మంత్రులు రాజీనామా చేసేవారని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బోటు ప్రమాదం జరిగితే ఆ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా అని అఖిలను ఉద్దేశించి మాట్లాడారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా