By : Oneindia Telugu Video Team
Published : January 04, 2018, 04:09

అక్కినేని ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు

అక్కినేని కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు చెందిన ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆదాయపు వివరాలను ఇవ్వని పలు ఎన్జీవోల గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఎన్జీవోలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో అక్కినేని ఫౌండేషన్ కూడా ఉంది.
విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలను అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వివరాలను సమర్పించని సంస్థలపై తాజాగా కేంద్రం వేటు వేసింది.
ఎఫ్‌సీఆర్ఏ లేని ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలు పొందలేవు. ఇప్పుడు దీనిని రద్దు చేయడంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విదేశాల నుంచి విరాళాలు పొందలేదు.
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను 2005లో అక్కినేని నాగాశ్వర రావు ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తుంటారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందిస్తున్నారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలను ప్రోత్సహిస్తున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా