By: Oneindia Telugu Video Team
Published : July 04, 2017, 11:51

అలెస్టర్ కుక్ సూపర్ క్యాచ్ వీడియో

Subscribe to Oneindia Telugu

అలెస్టర్ కుక్.... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌ను ఒకానొక దశలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. క్రికెటర్‌గా ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ప్రత్యేకంగా స్లిప్ క్యాచ్‌లను అందుకోవడంలో కుక్ దిట్ట అని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు.బంతి గమనాన్ని అంచనా వేయలేకపోవడం లేదా ఒత్తిడితో చాలా మంది క్రికెటర్లు క్యాచ్‌లు నేలపాలు చేసే సందర్భాలు అనేకం. అయితే తాజాగా అలెస్టర్ కుక్ మరోసారి తన మెరుగు ఫీల్డింగ్‌తో తానేమిటో నిరూపించుకున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో కుక్ పట్టిన క్యాచ్ అతని పాత రోజుల్ని గుర్తు చేసింది.అసలు బంతి వైపు చూడకుండానే తనను ఇంటర్యూ చేస్తున్న వ్యక్తి వైపు రయ్ మంటూ దూసుకొచ్చిన బంతిని కుక్ అద్భుతంగా ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా