• search
By : Oneindia Telugu Video Team
Published : December 18, 2017, 07:01
Duration : 02:02

ఒక్కో రాష్ట్రం మా వశం : శిరస్సు వంచి నమస్కారం

బీజేపీని గెలిపించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఆయా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో వేలెత్తి చూపడానికి వీలులేకుండా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెప్పారు. సుపరిపాలన, అభివృద్ధికి, ప్రజలు పట్టం కట్టారన్నారు. కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు.గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే మోడీ ప్రభావం, హవా చెక్కు చెదరలేదని అర్థమవుతోందని అంటున్నారు. సీఎంగా మోడీ ఉన్నప్పుడు గుజరాత్‌లో పారిశ్రామిక ప్రగతి కనిపించింది. అంతర్జాతీయ సంస్థలు గుజరాత్‌కు వచ్చాయి. శాంతిభద్రతలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మోడీ ఢిల్లీకి వెళ్లినా హవా తగ్గలేదు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో గెలుపుపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ నేతృత్వంలో 2019లోను ఇవే ఫలితాలు వస్తాయని షా ధీమా వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలపై అభివృద్ధి గెలిచిందని వ్యాఖ్యానించారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలోని ప్రజలు బీజేపీని నమ్మారని చెప్పారు. కోట్లాది మంది కార్యకర్తల కృషితో గెలుపు సాధ్యమైందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు బీజేపీ కార్యకర్తల విజయం అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more