By: Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 01:26

టార్గెట్‌‌‌కు దూరంగా బిజెపి, కారణమిదే

Subscribe to Oneindia Telugu

గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆరో దఫా విజయం సాధించింది.అయితే గతంలో కంటే తక్కువ సీట్లలో ఈ దఫా బిజెపి విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కుల రాజకీయాల వల్లే తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్టు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు.గుజరాత్ రాష్ట్రంలో బిజెపి విజయం సాధించింది. అయితే గుజరాత్‌లో బిజెపి విజయం సాధించడం కంటే కాంగ్రెస్ పార్టీ గతం కంటే పుంజుకోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకొందని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది.
అయితే ఈ దఫా గుజరాత్ ఎన్నికల్లో 150 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని బిజెపి రంగంలోకి దిగింది. కానీ, 99 స్థానాలకే బిజెపి పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని బిజెపి సాధించింది. కానీ, కాంగ్రెస్ పుంజుకోవడాన్ని మాత్రం నిలువరించలేకపోయింది.
గుజరాత్ రాష్ట్రంలో 150 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి ఎన్నికల రంగంలోకి దిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధానమంత్రి మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తదితరులు గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. గుజరాత్ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లనే కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కుల రాజకీయాల కారణంగానే తాము అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా