By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 07:36

మోత్కుపల్లి కి గవర్నర్ పోస్ట్ ? అమిత్ షా హామీ ...?

Subscribe to Oneindia Telugu


తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కల నెరవేరనుందా? టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ఇచ్చిన హామీ నెరవేరనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లికి గవర్నర్ పదవి అనే అంశం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ అది ఇప్పటి దాకా నెరవేరలేదు. ఇప్పుడు మోత్కుపల్లి ఆశలు తీరేలా కనిపిస్తున్నాయంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను మోత్కుపల్లి నర్సింహులు కలిశారు. కేంద్రం వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే ప్రయత్నాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా