By : Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 04:05

డ్రగ్ మత్తులో తారలే కాదు... యాంకర్లు కూడా ... ఎవరేంటి?

సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో తవ్విన కొద్దీ కొత్త పేర్లు బయటకొస్తున్నాయట. సిట్ అధికారులు ఒక్కొక్కరినీ విచారిస్తున్న కొద్దీ వారి నోటి నుంచి కొత్త పేర్లు బయటకొస్తున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు పూరీ జగన్నాథ్ నుంచి సేకరించిన సమాచారంతో కొన్ని కొత్త పేర్లు వెల్లడికాగా నిన్న శ్యాం.కె.నాయుడిని విచారించినప్పడు వెల్లడైన పేర్లు విని సిట్ అధికారులు కూడా షాకైనట్లు సమాచారం. ముఖ్యంగా ఓ ప్రముఖ మీడియా సంస్థ అధిపతి పేరును శ్యాం నాయుడు చెప్పారని... ఆయనతో పాటు పలువురు యాంకర్లు విలేకరుల పేర్లు కూడా చెప్పాడంటూ ఓ తెలుగు పత్రికలో కథనం ప్రచురితమైంది.ఈ డ్రగ్స్ దందాలో పారిశ్రామికవేత్తగా ఉన్న ఓ పత్రికాధిపతి పాత్ర కూడా ఉన్నట్టు శ్యాం.కె.నాయుడు చెప్పడంతో సిట్ అధికారులు ఇప్పటికే ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారని సమాచారం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా