By : Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 01:19

వైసిపి ఆళ్ల కాదు.. మేమే అడుగుతున్నాం : చంద్రబాబుకు హైకోర్టు షాక్!

అధికార తెలుగుదేశం పార్టీ నేతల పైన ఉన్న కేసులను ఉపసంహరించుకునే అంశంపై తాము దిగువ కోర్టులకు వెళ్లమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. టిడిపి నేతలపై ఉన్న కేసులను విత్ డ్రా చేసుకోవాలని తాము కింది కోర్టులను సంప్రదించమని తేల్చి చెప్పింది. మంగళగిరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ మేరకు పబ్లిక్ ఇంటరెస్ట్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. టిడిపి నేతలపై కేసుల విత్ డ్రా ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన కోర్టుకు వెళ్లారు. టిడిపి నేతలపై కేసులు ఎత్తివేసేందుకు జీవో ఇచ్చారని ఆయన అందులో పేర్కొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా