By : Oneindia Telugu Video Team
Published : December 21, 2017, 01:05

చంద్రన్న క్రిస్మస్ కానుకల హంగామా !, వీడియో !

చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీకి బుధవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న వారికి క్రిస్మస్, సంక్రాంతి కానులను అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు రకాల సరకులను ఈ కానుక కింద రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు.
ప్రతీ కుటుంబానికి కేజీ గోధుమపిండి, అరకేజీ చొప్పున కందిపప్పు, శనగపప్పు, బెల్లం, అరలీటర్‌ పామాయిల్‌, 100 ఎంఎల్‌ నెయ్యిని తయారు చేసి జ్యూట్‌బ్యాగులో అందిస్తున్నారు.
ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం నుంచి వచ్చే సోమవారం సాయంత్రం వరకు క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేస్తారు. ప్రభుత్వం ఈ కానుకల కోసం దాదాపు 360 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానుకల్లో నాణ్యత లోపిస్తే, చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకలను జనవరి 1 నుంచి పంపిణీ చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది.
కాగా చంద్రన్న కానుకలో మంచి నాణ్యత గల సరుకులు అందజేస్తున్నామని, ఎక్కైడెనా నాణ్యత లేని సరుకులు వస్తే వాటిని కార్డుదారులు తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రజలకు సూచించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా