By : Oneindia Telugu Video Team
Published : May 08, 2017, 04:29

చినరాజప్ప ఏం చేస్తన్నారు..? మీరు అసలు ఉన్నట్టేనా...?

ఏపీ హోంమంత్రి ఎవరో తెలుసా..? ఆయన ఎలా ఉంటారో తెలుసా..? ఆయన హోంశాఖకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని చెప్పగలరా..? ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఇప్పుడు ఎంత జీనియస్‌ను అడిగినా చెప్పలేరు. ఎందుకంటే హోంమంత్రిగా చినరాజప్ప ఉన్నారన్న సంగతి తెలుసుగానీ... ఆయన చేస్తున్న కార్యకలాపాలు ఏ ఒక్కరికీ తెలీదు. కారణం ఏంటంటే ఆయన ఏమీ చేయకపోవడమే. హోంమంత్రి పదవి అంటే చిన్నది కాదు. ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రంలో చక్రం తిప్పేది హోం మంత్రే. రక్షణ పరమైన బాధ్యతలు, లా అండర్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌లో చూసుకునే బాధ్యతలు ఒక్క హోంమంత్రికి మాత్రమే ఉంటాయి. హోంమంత్రి గనుక పవర్‌ఫుల్‌గా ఉంటే... రాష్ట్రంలో చిన్న దొంగతనం కూడా జరగదు. క్రై రేట్‌ పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. మన ఏపీ హోంమంత్రి చినరాజప్ప విషయానికి వస్తే... ఆయన ఇంతవరకూ సొంతంగా... ఆయన శాఖకు సంబంధించి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అంతా చంద్రబాబే చూసుకుంటారు. ఈయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత... మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా లెక్కగా... మూడు నాలుగు సార్లు మాత్రమే ఉంటాయి. అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాలకు తొక్కిసలాట జరిగిన సమయంలో... మాట్లాడారు. ఆతర్వాత అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా