By: Oneindia Telugu Video Team
Published : June 06, 2017, 11:24

ఎపికి ప్రత్యేక హోదా మోడీకి చిక్కులు?

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి జాతీయ రాజకీయాలకు వేదికైంది. రెవెన్యూ లోటు, పరిశ్రమలు లేక వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం తెలుగుదేశం వ్యతిరేకత, దాని మిత్రపక్షం బీజేపీ శషబిషల మధ్య కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరువలో మిర్చి గాటుకు మారుపేరుగా పరిగణించే గుంటూరు వేదికగా జాతీయ రాజకీయ పార్టీలన్నీ సమర శంఖం పూరించాయి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ జీవ నాడి అని, భావోద్వేగ పూరిత అంశం కానే కాదని నినదించారు. ఇది ఎన్నికల ప్రచార సంరంభం కానేకాదని తేల్చి చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా