అండర్-19లో మెరిసిన అర్జున్ టెండూల్కర్

Published : July 17, 2018 07:38 PM (IST)
Arjun Tendulkar Bats With 12th Ball Maiden India U19 Appearance
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత్ అండర్-19 తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే మెరిశాడు. కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో మంగళవారం ఆరంభమైన మ్యాచ్‌లో తానేసిన రెండో ఓవర్‌లోనే అర్జున్ వికెట్ పడగొట్టాడు. అర్జున్ విసిరిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన శ్రీలంక ఓపెనర్ మిశ్రా (9: 11 బంతుల్లో 2x4) వికెట్ల ముందు దొరికిపోయాడు.శ్రీలంక అండర్‌-19 జట్టుతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులు, 5 వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో.. జూన్‌లో బీసీసీఐ ప్రకటించిన భారత అండర్‌-19 జట్టులో అర్జున్‌ మొదటిసారి బౌలింగ్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. కొలంబో వేదికగా మంగళవారం భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే.. ఈ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి అర్జున్‌పై పడింది. ఈ మ్యాచ్‌ ద్వారా అర్జున్‌ భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది.
Up Next
Recommended వీడియోలు
  • 9 hours ago
    లేట్ నైట్ పార్టీలు , సిట్టింగులు.. ఆ జట్లు చేసే పని ఇదే..
  • 11 hours ago
    శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
  • 12 hours ago
    మాకు ఈ మ్యాచ్ అస్సలు గెలవాలని లేదు
  • 13 hours ago
    పవన్ కళ్యాణ్ పై ఎందుకు ఇన్ని క్రిమినల్ కేసులు..?
  • 13 hours ago
    వచ్చే రెండు రోజులు వానలు..
  • 14 hours ago
    ఎంత పని చేశావు తస్లీమ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా