By: Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 10:02

అట్టహాసంగా క్రీడా అవార్డుల ప్రదానోత్సవం

Subscribe to Oneindia Telugu

నేష‌న‌ల్ స్పోర్ట్స్ డే సంద‌ర్భంగా క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున, ఖేల్‌రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. క్రీడ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఈసారి క్రీడ‌ల్లో అత్యున్న‌త పుర‌స్కారమైన రాజీవ్ 'ఖేల్‌రత్న'ను రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర ఝజారియా, హాకీ క్రీడాకారుడు సర్దార్‌ సింగ్‌ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర నిలిచాడు. న‌లుగురికి ద్రోణాచార్య అవార్డులు ల‌భించాయి. మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ ఏడాది అర్జున అవార్డుని అందుకున్నారు. వీరిలో క్రికెట‌ర్లు పుజారా, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌లు ఉన్నారు. మ‌రో ముగ్గురు ధ్యాన్‌చంద్ అవార్డులు అందుకున్నారు. ఇక, రాష్ట్రీయ ఖేల్‌ ప్రోర్ట్‌ అవార్డును రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ గెలుచుకుంది. ఈ అవార్డుని నీతా అంబాని అందుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా