By : Oneindia Telugu Video Team
Published : November 21, 2017, 12:18

19 ఏళ్లలో యుగాంతం!


వచ్చే 19 ఏళ్లలో కలియుగం అంతమై పోతుందా? మానవ సమాజం మనుగడ మరో 19 ఏండ్లు మాత్రమేనా? అంటే అవుననే అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. భూగోళాన్ని 2036 ఏప్రిల్ 13న అపోఫిన్ అనే గ్రహ శకలం ఢీ కొడుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ శకలం ఢీకొనడంతో భూమిపై గల మానవ సమాజం పూర్తిగా అంతరించిపోతుందని చెప్తున్నారు. తద్వారా ధరిత్రిపై మానవ సమాజం అంతరిస్తుందని నాసా శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.2004లో తొలుత అపోఫిన్ గ్రహ శకలం ఉనికిని కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు స్టీవ్ చెస్లీ, పాల్ ఖోడాస్ గత 13 ఏండ్లుగా.. ప్రత్యేకించి 2009 నుంచి దాని కదలికలను గమనిస్తున్నారు. ఇది పర్వతాన్ని పోలి ఉంటుందని అంచనా వేశారు.
దీని కదలికలను పరిశీలించిన శాస్త్రవేత్తలు 2036 ఏప్రిల్ 13న భూమిని ఢీ కొడుతుందని నిర్ధారణకు వచ్చారని వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయం అధికారి డువాన్ బ్రౌన్ చెప్పారు. మరోవైపు అపోఫిస్ 2029, 2068ల్లోనూ భూమికి అత్యంత సమీపానికి వస్తుందని రష్యన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2029లో భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా భారీ విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఇందుకు 2.7 శాతం అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భూకంపాలు, సునామీలు తదితర ప్రకృతి విపత్తులు ఎదురవుతున్న నేపథ్యంలో డేవిడ్ మేడ్ వంటి కుట్ర సిద్ధాంత కర్తలు గత నెల 15న, ఈ నెల 19 (ఆదివారం) నిబిరు అనే ఉపగ్రహం భూమిని ఢీకొడుతుందని చెప్పారు. అయితే వారి జోస్యం తప్పని తేలింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా