దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search
By : Oneindia Telugu Video Team
Published : December 30, 2017, 05:24
Duration : 02:26

పవన్‌ సీఎం కాలేరు: బాబుకు పదవీగండం ?

జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేడని, ఇందుకు ఆయన జాతకం సహకరించదని చెప్పారు. అయితే, ఆయనకు ప్రత్యర్థుల నుంచి గట్టి కౌంటర్లు రావడం ఆయన స్టూడియో నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇప్పటికే సినీ క్రిటిక్ కత్తి మహేష్.. పవన్‌పై వ్యాఖ్యలు చేసి అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌కు రాజభోగమే తప్ప.. రాజయోగం లేదని వేణు స్వామి వ్యాఖ్యానించారు. దీంతో స్పందించిన జనసేన కార్యకర్త కిరణ్ తీవ్రంగా విభేదించారు. ఇక ఆ సమయంలోనే డిస్కషన్ కు వచ్చిన జనవిజ్ఞానవేదిక సభ్యులు పీవీ రావు కలగజేసుకుని.. వేణు స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. వేణుస్వామి మాటల గారడీలు చేస్తున్నారని, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.ఈ సమయంలో వేణు కల్పించుకుని.. తనను పవన్ కళ్యాణ్‌పై మాట్లాడాలని సదరు టీవీ ఛానల్ పిలిపించిందని, డిస్కషన్‌ను మారుస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎన్నికలకు ఏడాదిన్నర ముందే పవన్ గురించి ఎలా చెబుతారని, గతంలో వెంకయ్యనాయుడు సీఎం అవుతారని తప్పుడు జోస్యం చెప్పారని చర్చవేదికలో పాల్గొన్న పీవీ రావు మండిపడ్డారు.

ఈ చర్చలో పాల్గొన్న సినీ నటుడు వేణుమాధవ్.. తన డేటాఫ్ బర్త్ చెప్పి, తాను ఎమ్మెల్యేగా గెలుస్తానా? అని ప్రశ్నించాడు. తాను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి వేణు స్వామి సమాధానం ఇస్తూ.. ఈ జాతకుడిని 2012 నుంచి అనారోగ్యం పీడిస్తోందని, లివర్ సమస్యలు వస్తాయని, సినిమా అవకాశాలు తగ్గుతాయని అన్నారు. 2020 వరకూ ఎమ్మెల్యే అవకాశం లేదన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి