By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

ఆటో డ్రైవర్స్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలి : ఆటో కార్మిక సంఘాలు

Subscribe to Oneindia Telugu

ఆటో డ్రైవర్స్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘాలు విశాఖలోని తూనికలు కొలతల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి నగరంలోని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమపై అక్రమంగా బనాయిస్తున్న కేసులను తక్షణమే ఎత్తివెయాలని వారు నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎ రెహ్మన్ మాట్లాడుతూ నగరంలో ఆటోలకు మీటర్లు లేవన్న సాకు చూపి తూనికలు కొలతల శాఖ అధికార్లు కేసులు నమోదు చేసి చలానాలు ఇస్తున్నారని వారు అవేదన వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా