By: Oneindia Telugu Video Team
Published : April 29, 2017, 01:26

The Complete Story : రామా విడుదల ఎప్పుడు? అయోద్య అంశం తేలేనా...?

Subscribe to Oneindia Telugu

మరుగునపడి ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేత విషయం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈకేసులో తీర్పు ఏవిధంగా ఉంటుందనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే.... అసలు ఈ కేసు నిలుస్తుందా లేదా..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడిచిన పరిస్థితులు... అక్కడ సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తే... ఈకేసులు ఎట్టి పరిస్థితిలో నిలిచేది మాత్రం కాదనేది... కొందరు సీనియర్‌ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఏ కోర్టు అయితే బాబ్సీ మసీదు కూల్చి వేత కేసులో కొందరిని నిందితులుగా తేల్చిందో.. అదే కోర్టు సాంకేతిక ఆధారాలే ఈ కేసుకు కీలకంగా భావించింది. అయితే కోర్టులో నడుస్తున్న కేసు ఆధారంగా చూస్తే... 1992లో బీజేపీ అగ్రనేతలైన.. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతిలు... రెచ్చగొట్టి బాబ్రీ మసీదును కూల్చారనేది అభియోగం. కానీ ఈ కేసులో అప్పుడున్న వీడియో పుటేజ్‌ సాంకేతిక ఆధారాలే కీలకం. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో... ఎలాంటి విద్శంసక చర్యలు వద్దని... అందరూ వెనక్కి వచ్చేయ్యాలంటూ... వీరంతా గట్టి కేకలు పెట్టడం.. అరుపులు అరవడం వీడియో ఫుటేజీలో స్పష్టంగా ఉంది. దీంతో కావాలనే బీజేపీ నేతలపై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కుట్ర కోణంలో కేసులు నమోదు చేసిందనేది కొందరి అభిప్రాయం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా