By: Oneindia Telugu Video Team
Published : December 06, 2017, 12:12

బాబ్రీ మసీదు కూల్చివేతకు '25'ఏళ్లు

Subscribe to Oneindia Telugu


బాబ్రీ మసీదు కూల్చివేతకు నేటితో 25ఏళ్లు. మతాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై నేటికి ఎన్నో వాదనలు. మసీదును కూల్చివేసి రామ మందిరం నిర్మించాలన్న ఉద్దేశంతో అప్పటి బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. నేటితో బాబ్రీ విధ్వంసానికి 25 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో.. ముస్లిం మత సంస్థలు, ఎంబీటీ, ఏఐఎంఐఎం పార్టీలు బుధవారం 'బ్లాక్ డే' ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పాతబస్తీలో 3500మంది పోలీసులతో ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
డిసెంబర్ 6 బ్లాక్ డే నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం సాయంత్రం భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. పాతబస్తీలో 60 సున్నితమైన, 10 అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. భద్రతా చర్యల దృష్ట్యా 3,500 మందికి పైగా పోలీసులను మోహరించామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి బుధవారంతో ఇరవై ఐదేళ్లు పూర్తవుతుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా