By: Oneindia Telugu Video Team
Published : December 02, 2017, 05:55

భారత్‌లోనే నాకు ఎక్కువ పని : ఒబామా

Subscribe to Oneindia Telugu

భారతీయ ముస్లింలు మొదట తాము భారతీయులమనే భావిస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. భారత పర్యటనలో ఉన్న ఒబామా శుక్రవారం హిందుస్తాన్‌ టైమ్స్‌ నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఒబామా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ పలు ఆసక్తికర అంశాలపై ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఒబామా ఫౌండేషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయమో, అధ్యక్షుడి కార్యాలయమో ముఖ్యమైనవి కావని ఒబామా స్పష్టం చేశారు. తనకు నచ్చిన సిద్దాంతానికి మద్దతు తెలిపి దాన్ని ప్రోత్సహించే పౌరుడే ప్రజాస్వామ్యంలో కీలకం అని తెలిపారు. నాయకుల నిర్ణయాలు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు.. అది సరైందో కాదో ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత పౌరుడిపై ఉంటుందన్నారు.
21వ శతాబ్దపు భాగస్వామ్యాన్ని నిర్ణయించేది భారత్‌-అమెరికాల సంబంధాలే అని ఒబామా పేర్కొనడం గమనార్హం. ఒక్క అమెరికాకే పరిమితం అవకుండా ప్రపంచవ్యాప్తంగా యువ నాయకులకు శిక్షణ ఇవ్వడంపైనే ఇకనుంచి తన ఫోకస్ ఉంటుందన్నారు. అంతేకాదు, యువత ఎక్కువగా ఉన్న భారత్‌లోనే తనకు ఎక్కువ పని ఉంటుందని అనడం గమనార్హం. ఒబామా ఫౌండేషన్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 300మంది యంగ్ లీడర్స్ పాల్గొన్నారు.


Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా