హైదరాబాద్ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు , వృద్ధుల కోసం ఈ వెహికల్
Published : October 12, 2022, 05:40
శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. నడవలేను వృద్ధుల కోసం బ్యాటరీ వెహికల్ ఏర్పాటు చేసారు ఎవరైతే నడవలేని వారు, వృద్దులు ఉంటారో వారిని ఆ వెహికల్ ద్వారా లోనికి తీసుకెళ్ళుతున్నారు. నడవలేని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఈ వెహికల్ అందుబాటులో ఉంచడం వలన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు