By : Oneindia Telugu Video Team
Published : May 10, 2018, 09:33

ఇంగ్లాండ్ పర్యటనకి భారత జట్టు ప్రకటన

ఐపీఎల్ అనంతరం టీమిండియాను విదేశీ పర్యటనకు సంసిద్ధం చేస్తుంది బీసీసీఐ. ఈనేపథ్యంలోనే ఐర్లాండ్‌కు వెళ్లనున్న జట్టును తేదీ తదితర వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా జట్టు 11 ఏళ్ల తరువాత మళ్లీ ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ-20 మ్యాచ్‌ల నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.
ఐర్లాండ్ దేశ రాజధాని డబ్లిన్‌లో జూన్ 27, 29 తేదీల్లో జరగనున్న రెండు టీ-20 మ్యాచ్‌‌ల్లో ఐర్లాండ్, భారత్ జట్లు తలపడనున్నాయి. అదే టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లోనూ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా జట్టు వివరాలను వెల్లడించింది.
ఐర్లాండ్, ఇంగ్లాడ్ టూర్‌లో ఆడనున్న టీమిండియా జట్టు సభ్యులు వీరే..: విరాట్ కోహ్లీ(కెప్టెన్) ధోని, దినేష్ కార్తిక్, చాహల్, కుల్‌దీప్, సుందర్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, హర్దిక్, కౌల్, ఉమేష్ ఉన్నారు.
భారత్‌ చివరిసారి 2007లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌ జట్టుతో వన్డే ఆడింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 9 వికెట్లతో విజయం సాధించింది. తర్వాత 2009 టి20 ప్రపంచకప్‌ సందర్భంగా నాటింగ్‌హామ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా