By: Oneindia Telugu Video Team
Published : June 27, 2017, 06:33

తేజస్విని వాంగ్మూలం లో ఏం చెప్పిందంటే...!

Subscribe to Oneindia Telugu

బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో తేజస్విని తొలిసారి స్పందించింది. కేసు అనేక మలుపులు తిరుగుతున్నా, ఇంతవరకు మీడియా ముందుకు రాని తేజస్విని పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చింది. శిరీష ఆత్మహత్యకు పాల్పడిందనే వార్త తనకు ఎంతో బాధను కలిగించిందని చెప్పింది. ఇంత చిన్న విషయానికే శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని వాంగ్మూలంలో ఆమె తెలిపింది. అయితే రాజీవ్ కు పేస్ బుక్ ద్వారా పరిచయం అయిన తేజస్విని రాజీవ్ ను ఎంతగానో నమ్మా నని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని అయితే అనుకోకుండా 4 నెలల క్రితం రాజీవ్ శిరీష తో కలిసి దిగిన ఒక ఫోటో ను షేర్ చేయడం తో ఎవరు అని అడిగితే ప్రోఫెషనల్ పార్టనర్ అని చెప్పడం తో లైట్ తీసుకున్నా అని, అయితే శిరీష ప్రతి ఫోటో కి లైక్స్ కొట్టడం తో రాజేవ్ ను నిలదీసిన తేజస్విని , శిరీష కు తనకు కేవలం బిజినెస్ రిలేషన్స్ తప్ప ఇంకేం లేవని చెప్పడం తో అప్పటికి కన్వీన్స్ అయిన తేజస్విని కొద్దిరోజులు తర్వాత రాజీవ్ కి చెప్పకుండా ఆఫీసు కు వెళ్ళిన టైం లో అక్కడ పని చేస్తున్న వర్కర్స్ సార్, మేడం లేరని ఇద్దరు బయటకి వెళ్ళారని చెప్పడం తో సార్ మేడం ఏంటి అని తేజస్విని అడగ్గా , అవును వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటున్నాం మేడం కూడా ఇక్కడే ఉంటారు అని అక్కడున్న వర్కర్స్ చెప్పారని తేజస్విని తన వాంగ్మూలం లో పేర్కొంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా