దీప్తి శర్మ విషయంలో బెన్ స్టోక్స్ ని లాగుతున్న నెటిజన్లు...!
Published : September 27, 2022, 01:50
ఇటీవల ఇండియా వుమెన్ వర్సెస్ ఇంగ్లాండ్ వుమెన్ వన్డే సిరీస్‌లో దీప్తి శర్మ వివాదాస్పద రీతిలో ఛార్లీ డీన్‌ను (మన్కడింగ్) రనౌట్ చేసిన ఘటన పెను దుమారం రేపింది. ఇంగ్లీష్ మీడియా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు కుమ్మరించగా.. భారత నెటిజన్లు సోషల్ మీడియాలో దీప్తిని సపోర్ట్ చేస్తూ కామెంట్లు, పోస్టులు హోరెత్తిస్తున్నారు.