By: Oneindia Telugu Video Team
Published : May 06, 2017, 03:04

బెంగుళూరు మళ్ళీ ఫ్లాప్ షో

Subscribe to Oneindia Telugu

పాపం బెంగళూరు ఏమైందో తెలీదు... పదో సేజన్ లో అత్యంత చెత్త ప్రదర్శన్ చేస్తుంది.....! ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన రాయల్‌ చాలెంజర్స్‌ ఈ సీజన్‌లో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్టుంది..! అంతలా దయనీయంగా ఆడుతోంది ఆ జట్టు..! ఇప్పటికే నాకౌట్‌ రేసు నుంచి తప్పుకొన్న కోహ్లీసేనకు కనీసం ఓదార్పు కూడా దక్కడం లేదు..! తాజాగా పంజాబ్‌ చేతిలో బెంగళూరు చిత్తయింది..! బౌలర్ల కృషితో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. బ్యాట్స్‌మెన్‌ మరోసారి చేతులెత్తేయడంతో ఆర్‌సీబీ లీగ్‌లో తొమ్మిదో ఓటమిని మూటగట్టుకుంది..! మరోవైపు అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులకు.. సందీప్‌ శర్మ, మాక్స్‌వెల్‌ అద్భుత బౌలింగ్‌ తోడవడంతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న కింగ్స్‌ లెవెన్‌ ఐదో విజయంతో తమ ప్లేఆఫ్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది..!
ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆనందం బెంగళూరుకు ఎంతోసేపు నిలువలేదు. స్వల్ప ఛేదనలో ఆ జట్టు ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. రెండు మ్యాచ్‌ల అనంతరం బరిలోకి దిగిన క్రిస్‌ గేల్‌ (0) మరోసారి ఫెయిలవగా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (6), ఏబీ డివిల్లీర్స్‌ (10) కూడా నిరాశ పరిచారు. వరుస ఓవర్లలో ఈ ముగ్గురినీ అవుట్‌ చేసిన సందీప్‌ శర్మ ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాకిచ్చాడు. ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురినీ అవుట్‌ చేసిన తొలి బౌలర్‌గా సందీప్‌ నిలిచాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా