By: Oneindia Telugu Video Team
Published : September 06, 2017, 02:22

కన్నడ పాత్రికేయురాలు గౌరి లంకేష్ హత్య: ప్రత్యక్ష సాక్షులు

Subscribe to Oneindia Telugu

ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మతసామరస్య వేదిక నాయకురాలు గౌరి లంకేష్ (55) హత్య కేసులో బెంగళూరు పోలీసులు కీలక సాక్షాధారాలు సేకరించారు. గౌరి లంకేష్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. గౌరి లంకేష్ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలలో రికార్డు అయిన దృశ్యాలలో వెలుతురు తక్కువగా ఉండటంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా