By : Oneindia Telugu Video Team
Published : October 16, 2017, 06:12

గోవధను అడ్డుకున్న లేడీ టెక్కీ: 150 మంది దాడి

గోవధను అడ్డుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద 150 మందికి పైగా దాడి చేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నందిని అనే లేడీ టెక్కీ మీద దాడి చేసిన స్థానికులు ఆమె కారును ధ్వంసం చేసి నీకు దిక్కున్నచోట చెప్పులో అని సవాలు చేశారు. తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని టిప్పు సర్కిల్ లోని కసాయిఖానాలో అక్రమంగా గోవధ జరుగుతోందని లేడీ టెక్కీ నందిని గుర్తించారు. ఇద్దరు పోలీసులను వెంట పెట్టుకుని టిప్పు సర్కిల్ లోని కసాయిఖానా దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఓ వర్గం వారు అధిక సంఖ్యలో ఉన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా