By: Oneindia Telugu Video Team
Published : May 11, 2017, 03:36

అత్యంత సేఫ్టీ బెంజ్ కారు కూడా ఎందుకు కాపాడలేదంటే ?

Subscribe to Oneindia Telugu

ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్, అతని స్నేహితుడు రాజా రవివర్మ హైదరాబాదులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఐతే వారు ప్రయాణించిన కారు అంతర్జాతీయ, అత్యున్నత ప్రమాణాలతో తయారయింది. అయినప్పటికీ వారు మృతి చెందారు. నిషిత్ ప్రయాణిస్తున్న కారు సాదాసీదా కారు కాదు. అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా రక్షణ చర్యలు ఉండే బెంజ్ కారు. అందులోను బెంజ్ మోడల్‌లో హైఎండ్ అయిన జీ సిరీస్ కారు. కారు స్పెసిఫికేషన్స్‌కు తగ్గట్టు ఖరీదు కూడా చాలా ఎక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్ సెక్యూరిటీ ఫీచర్స్‌తో అందులో ఉన్న వాళ్ల ప్రాణాలు పోకుండా కాపాడగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. లోపం మాత్రం కారు స్పీడ్‌లోనే ఉందని అంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా