By : Oneindia Telugu Video Team
Published : December 05, 2017, 06:14

2017: టీఆర్ఎస్‌కు కోలుకోని దెబ్బ

2017వ సంవత్సరం చరమాంకానికి వచ్చింది. తెలంగాణ ఏర్పడి మూడున్నరేళ్లు పూర్తయిపోతున్న సందర్భం. బంగారు తెలంగాణ పాలకులను అత్యంతగా కబళించిన సంవత్సరం కూడా ఇదే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మూడేళ్ల పాటు పాలకులు దగదగా మెరిపించినట్లే కనిపించింది. జర్నలిస్టులు,మేదావులు, కవులు.. చాలామంది ప్రభుత్వ పక్షాన చేరిపోవడం వల్ల.. బహుశా ఆ మూడేళ్లలో అసలు సమస్యలే లేవా? అన్నట్లు తయారైంది పరిస్థితి. కానీ 2017లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏడాది ఆరంభం నుంచే ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. అది మంథని మధుకర్ ఘటన కావచ్చు, నేరెళ్ల కావచ్చు.. బతుకమ్మ చీరలు కావచ్చు.. ప్రజలంతా ప్రభుత్వంపై గట్టిగా తిరగబడ్డారు. మరోవైపు విద్యార్థులు నిరంతరం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.
ఈ ఏడాది తెలంగాణను అత్యంత కుదిపేసిన సంఘటన మంథని మధుకర్ హత్య. కులం కాని అమ్మాయిని ప్రేమించినందుకు అత్యంత కిరాతకంగా హత్య గావించబడ్డ మధుకర్ కేసులో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంథనిలో మెరుపు ధర్నా చేశాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత మరోసారి ఉవ్వెత్తున ఈ నిరసన ఎగిసిపడింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా